ఆలోచనే ఆసరాగా..

ప్రధానాంశాలు

ఆలోచనే ఆసరాగా..

కలలుగన్న జీవితం ‘కల’గానే మిగిలిపోకూడదని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోంది ప్రసన్నలక్ష్మి. ఆమె ఒకప్పుడు విజయవాడలోని కార్పొరేటు కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఈమె భర్త వీర శ్రీనివాసరావు సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవారు. వీరి ఇద్దరు ఆడపిల్లలలను ఉన్నత చదువులు చదివించి మంచి జీవితం అందించాలని కలలు కనేవారు. ఈ సమయంలో ప్రసన్నలక్ష్మికి ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్య తలెత్తడంతో కనీసం నిల్చోలేని పరిస్థితిలో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆసుపత్రి పాలవడంతో జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అయినా వెనకడుగు వేయకుండా.. కొత్త ఆలోచనతో భర్తతో కలిసి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించారు. రూ.2 లక్షల ఖర్చుతో పాత వ్యాను,  కంప్యూటరు, ప్రింటరు కొన్నారు. విజయవాడ చుట్టుపక్కన ఉన్న గ్రామీణప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి వారికి కావాల్సిన ఓటరు, పాన్‌ కార్డులకు   దరఖాస్తు చేయడంతో పాటు, ఆధార్‌ ప్రింట్‌ తీయడం, లామినేషన్‌, ఫొటోలు ప్రింటు ఇవ్వడం, ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు బిడ్డలను ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని