చెత్త సేకరించాల్సినవి.. చెత్తలో కలిసిపోయాయి..

ప్రధానాంశాలు

చెత్త సేకరించాల్సినవి.. చెత్తలో కలిసిపోయాయి..

x

స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో గత ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాకు మంజూరైన ఈ-ఆటోలు, ట్రాక్టర్లు, మినీ జేసీబీల దుస్థితి ఇది. కర్నూలు ఎస్సీ కార్పొరేషన్‌ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ఇవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 292 ఈ-ఆటోలు, 30 ట్రాక్టర్లు, 35 మినీ జేసీబీలు అందించేందుకు 220 మందిని గుర్తించారు. వీటిని లబ్ధిదారులకు అందించాల్సి ఉన్నా అది నేటికీ ఆచరణకు నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్త సేకరణ కోసం మంజూరైన వాహనాలు కార్యాలయ ఆవరణలో చెత్తలాగా మూలకు చేర్చడం గమనార్హం. తుప్పు పట్టి, టైర్లు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

- ఈనాడు, కర్నూలు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని