రిజిస్ట్రేషన్‌ సేవల నిలిపివేత?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిజిస్ట్రేషన్‌ సేవల నిలిపివేత?

విడుదల కానున్న మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల సేవలను పది రోజులపాటు నిలిపివేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే నమోదు చేసుకున్న స్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం విదితమే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ప్రజా రవాణాను అనుమతించనున్నారు. క్రయ విక్రయదారులు తహసీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. ఆ సమయానికి కార్యాలయాలు కూడా తెరుచుకోవు. మరోవైపు రెవెన్యూ కార్యాలయాల్లో వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే 75 మందికిపైగా తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు మృతి చెందారు. కరోనా కట్టడి అయ్యేవరకు ప్రతిరోజూ అమలు చేస్తున్న 30 స్లాట్ల సంఖ్యను కుదించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని