మండు వేసవిలో మంచు దుప్పటి
close

ప్రధానాంశాలు

మండు వేసవిలో మంచు దుప్పటి

ఆంధ్రా కశ్మీరం లంబసింగి మంచుతో సింగారించుకుంది. మండు వేసవిలోనూ ఆదివారం ఉదయం దట్టంగా పొగమంచు అలుముకుంది. ఉదయం పది గంటల వరకు మంచు తెరలు తొలగకపోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా విశాఖ మన్యంలో భిన్నమైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం మంచు కురుస్తోంది. మధ్యాహ్నం 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతోంది.          

          - న్యూస్‌టుడే, చింతపల్లి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని