ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
తెలుగుమహిళ నేతల ఇళ్లలో సోదాలు

బంగారం, బ్యాంకు పుస్తకాలు చూపించాలని ఆదేశాలు
అనంతలో పోలీసుల తీరుపై తెదేపా మండిపాటు

అనంతపురంలో తెలుగుమహిళ నాయకురాలి ఇంట్లో పోలీసుల సోదాలు

అనంతపురం (రాణీనగర్‌), న్యూస్‌టుడే: అనంతపురంలోని నలుగురు తెలుగుమహిళ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సిబ్బందితో సోదాలు చేయడాన్ని తెదేపా శ్రేణులు తప్పుబట్టాయి. ముందుగా తెలుగుమహిళ రాష్ట్ర కార్యదర్శి స్వప్న ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న బంగారం, నగదు, డాక్యుమెంట్లు, బ్యాంకు పుస్తకాలు చూపాలని కోరడంతో ఆమెతో పాటు భర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వారిద్దరూ రోడ్డుపైనే బైఠాయించారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే ప్రతివిమర్శ చేయడం తప్పా? అని ఆమె పోలీసులను ప్రశ్నించారు. తెలుగుమహిళ నేతలు, మాజీ కార్పొరేటర్లు విజయశ్రీ, జానకి నివాసాల్లోనూ సోదాలు చేశారు. తెలుగుమహిళ జిల్లా నాయకురాలు తేజస్విని ఇంటికి వెళ్లి డ్రైవింగ్‌ స్కూలు రికార్డులు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని వారి వాహనాలను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. వీరికి ఇటీవల లెక్కకు మించిన నగదు అందిందని సమాచారం వచ్చిందని, ఆ వివరాలు తెలుసుకునేందుకే తనిఖీలు చేశామన్నారు.

ఇంటి ఎదుట బైఠాయించిన తెలుగుమహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్వప్న, ఆమె భర్త

మహిళలపై ప్రతాపమా?: అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగుమహిళ నేతలను పోలీసులు వేధించటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి తెలుగు మహిళలను వేధిస్తారా?’ అని ప్రశ్నించారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.