Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
విండీస్‌పై శ్రీలంక విజయం

గాలె: శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో లాంఛనం పూర్తయింది. ఊహించినట్లే విండీస్‌పై ఆతిథ్య శ్రీలంక విజయం సాధించింది. గురువారం ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 187 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 52/6తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. 348 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి.. బుధవారమే ఓటమిని ఖాయం చేసుకున్న విండీస్‌ అయిదో రోజు కాస్త పోరాడింది. బానర్‌ (68 నాటౌట్‌; 220 బంతుల్లో 7×4), జోషువా డిసిల్వా (54; 129 బంతుల్లో 5×4) ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించి శ్రీలంక గెలుపును ఆలస్యం చేశారు. అయితే శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్‌ లసిత్‌ (5/46) విజృంభించి జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో మెరిసిన కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నెకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.