
క్రీడలు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, సాయి ప్రణీత్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ సింధు 21-12, 21-18తో యోనె లీ (జర్మనీ)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 21-17, 14-21, 21-19తో క్రిస్టొ పొపోవ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. కిదాంబి శ్రీకాంత్ 14-21, 18-21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి 21-15, 19-21, 23-21తో కాంగ్- సియో (కొరియా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో సిమ్ యుజిన్ (కొరియా)తో సింధు, అక్సెల్సెన్తో సాయి ప్రణీత్, జో ఫీ- నూర్ ఐజుద్దీన్ (మలేసియా)తో సాత్విక్- చిరాగ్ తలపడతారు.