Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
సంక్షిప్త వార్తలు

రేపు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనం కోసం డిసెంబరు మాసానికి సంబంధించిన సమయ నిర్దేశిత(స్లాటెడ్‌) సర్వదర్శనం టోకెన్లు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబరు  కోటాను ఈనెల 28వ తేదీ ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వివరించింది.


‘పవర్‌’ బకాయిల చెల్లింపులకు రూ.1,500 కోట్ల ఎస్‌బీఐ రుణం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పవర్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌కు, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిల కోసం అప్పు తెచ్చుకుంది. ఏపీ మారిటైం బోర్డు ద్వారా ఎస్‌బీఐ నుంచి ఈ రుణం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పోర్టు నిర్మాణం పేరుతో తాజాగా రూ.1,500 కోట్లు ఎస్‌బీఐ రుణం ఇచ్చింది. ఈ మొత్తం రుణ సమీకరణ జరిగినా బకాయిల చెల్లింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఆర్‌ఈసీలకు జెన్‌కో రూ.1,100 కోట్లు, పవర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ రూ.1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. నవంబరు నెలతో కలిపి నాలుగు నెలల పాటు బకాయిలు పెండింగులో ఉండటంతో నేరుగా ఆ కార్పొరేషన్ల పెద్దలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐతో మాట్లాడి ప్రభుత్వం రుణ ఏర్పాట్లు చేసిందని తెలిసింది. ఆ మేరకు రూ.1,500 కోట్లు ఎస్‌బీఐ నుంచి మారిటైం బోర్డుకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన నేటి నుంచి

ఈనాడు, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన నష్టాలను అంచనా వేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తోందని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారని వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు, 27న చిత్తూరులో ఒక బృందం, కడపలో మరో బృందం, 28న నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటిస్తాయని వివరించారు. అనంతరం 29న ఉదయం సీఎం జగన్‌తో కేంద్ర బృందం సమావేశమవుతుందన్నారు.


ఒడిశా-ఆంధ్రా వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడిశా-ఆంధ్రా మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మందితో ప్రత్యేక కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. ఒడిశా ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్ర్‌ ఈ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల, విద్యుత్తు, సరిహద్దు సమస్యలతోపాటు కొఠియా, నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నట్లు తెలిసింది.


2023 అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు కొత్త సిలబస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి 2023లో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిలబస్‌ మారనుంది. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల కొత్త సిలబస్‌ వివరాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అడ్వాన్స్‌డ్‌ 2021 వెబ్‌సైట్లో పొందుపరిచింది. 2-5 శాతం సిలబస్సే మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో ఉండే అంశాలను అడ్వాన్స్‌డ్‌లో చేర్చారని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. ఉదాహరణకు గణితంలో సెట్స్‌, రిలేషన్స్‌, స్టాటిస్టిక్స్‌ కలపగా ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ట్రయాంగిల్స్‌ అనే అంశాన్ని తొలగించారు. రెండేళ్ల ముందుగానే పాఠ్య ప్రణాళిక మారుతున్న విషయాన్ని ఐఐటీ అధికారులు చెప్పడంతో పాటు సిలబస్‌ను ఇవ్వడం విశేషం.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.