
ఆంధ్రప్రదేశ్
శివమొగ్గ, న్యూస్‌టుడే: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని కెళది శివప్ప నాయక వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి గురువారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున నిరాడంబరంగా నిర్వహించిన ఆరో స్నాతకోత్సవంలో.. కులపతి, రాష్ట్ర గవర్నరు థావర్‌చంద్ గహ్లోత్ ఆయనకు పట్టా ప్రదానం చేశారు. పలువురు విద్యారంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.