తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Crime News: ఎస్సై పరీక్షకు హాజరైన యువతిపై కదిలే కారులో అత్యాచారం

యూపీలో దారుణం

మథుర: సామాజిక మాధ్యమాల్లో చేసే కొన్ని స్నేహాలు ఎంత చేటు చేస్తాయో తెలిపే సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో జరిగింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన 21 ఏళ్ల యువతిని.. ఓ యువకుడు కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. బాధిత యువతి ఎస్సై పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి.. హరియాణాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. తాను ఆగ్రాలో ఎస్సై రాత పరీక్షకు హాజరవుతున్నట్లు యువతి చెప్పింది. దీనిని అదనుగా భావించిన ఆ యువకుడు... మంగళవారం తన డ్రైవర్‌తో కారులో బయలుదేరి ఆమె పరీక్ష రాస్తున్న కేంద్రానికి చేరుకున్నాడు. పరీక్ష రాసి వస్తున్న ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమెకు మత్తు మందిచ్చి కదులుతున్న కారులోనే అత్యాచారం చేశాడు. స్పృహ తప్పి పడిపోగానే ఆగ్రా-దిల్లీ హైవే పక్కన వదిలేసి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.