Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
షహీన్‌-1ఏ క్షిపణిని పరీక్షించిన పాక్‌

ఇస్లామాబాద్‌: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే షహీన్‌-1ఏ క్షిపణిని పాకిస్థాన్‌ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ అస్త్రంలోని డిజైన్‌, సాంకేతిక అంశాలను పునఃపరిశీలించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు పాక్‌ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అస్త్రం.. 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌లు అభినందించారు.

కొత్త రకం ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

బీజింగ్‌: చైనా గురువారం రోదసిలోకి ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది. పరీక్షల కోసం దీన్ని పంపినట్లు అధికారిక మీడియా తెలిపింది. అవి ఎలాంటి పరీక్షలన్నది మాత్రం వెల్లడించలేదు. షియాన్‌-11 అనే ఈ శాటిలైట్‌ను జియుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి కువాయిఝౌ-1ఏ వాహకనౌక నుంచి ప్రయోగించారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.