తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
IND vs NZ: చివర్లో ఆకట్టుకున్న అశ్విన్‌.. టీమ్‌ఇండియా 345 ఆలౌట్‌

శతకంతో కదంతొక్కిన శ్రేయస్‌ అయ్యర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో కదంతొక్కాడు. రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) తొలిరోజు స్కోర్‌ వద్దే ఔటయ్యాడు. ఇక టెయిలెండర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (38; 56 బంతుల్లో 5x4) కీలక పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5/69, కైల్‌ జేమీసన్‌ 3/91, అజాజ్‌ పటేల్‌ 2/90 ప్రదర్శన చేశారు.

భారత్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌ 258/4తో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభించగా మరో 87 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్న సౌథీ ఈ ఉదయం మరో నాలుగు వికెట్లు సాధించాడు. ఆదిలోనే జడ్డూను బౌల్డ్‌ చేసిన అతడు తర్వాత వృద్ధిమాన్‌ సాహా (1), అక్షర్‌ పటేల్‌(3)ను కూడా పెవిలియన్‌ పంపాడు. వీరిద్దరూ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ఈ క్రమంలోనే జేమీసన్‌ వేసిన 92వ ఓవర్‌లో శ్రేయస్‌ తొలి బంతికి రెండు పరుగులు సాధించి టెస్టుల్లో తొలి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక భోజన విరామానికి ముందు అశ్విన్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 339/8తో తొలి సెషన్‌ను ముగించింది. భోజన విరామం అనంతరం అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌(0)ను ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కు 345 పరుగుల వద్ద తెరపడింది. ఉమేశ్‌ (10; 34 బంతుల్లో 1x6) నాటౌట్‌గా నిలిచాడు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.