
సినిమా
హైదరాబాద్: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో నటి పూజాహెగ్డే భాగమయ్యారు. నటుడు సుశాంత్ విసిరిన సవాలు స్వీకరించిన ఆమె శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మూడు మొక్కలు నాటారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, రితీష్ దేష్ముఖ్ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. సినీ ప్రముఖులతోపాటు క్రీడా, రాజకీయ రంగాల నుంచీ ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
► Read latest Cinema News and Telugu News