తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. చంద్రబాబు సంస్కారానికి నమస్కారం: జగన్‌

ఏపీలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై శాసనసభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ‘‘గాల్లోనే వచ్చి గాల్లోనే పోతారని.. ఎక్కడో చోట శాశ్వతంగా కనుమరుగు అవుతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. ఆయన వెళ్లిన పర్యటనేంటి? ఆయన మాట్లాడుతోందేంటి? చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు. నా పర్యటన ఆగితే నష్టమా? సహాయక చర్యలు ఆగితే నష్టమా? అనేది ఆలోచించుకోవాలి’’ అని ప్రశ్నించారు.

2. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్‌) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వహ‌ణపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవ‌హారాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవ‌హ‌రించినట్లు నివేదికలో పేర్కొంది.

3. రాజధాని వ్యాజ్యాల కేసులో హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ నెల 22న శాసనసభలో, 23న శాసన మండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్లు శాసనసభ కార్యదర్శి తెలిపారని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్‌ను ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు.

4. కేసీఆర్‌ దిల్లీ ఎందుకు వెళ్లారు?: జీవన్‌రెడ్డి

ధనిక రాష్ట్రం అని చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం.. రైతుల కోసం రూ.5వేల కోట్లు వెచ్చించలేదా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తుంటే మంత్రులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఎప్పుడైతే ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడగలేదో అప్పుడే వీరి నిజరూపం బయటపడిందని, ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరకుండా సీఎం దిల్లీ ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు.

5. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన జమ్మలమడుగు నేతలు

రాష్ట్రాన్ని  కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.  మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. ఈ సందర్భంగా చంద్రబాబు.. భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు.

6. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి

నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని పార్లమెంట్‌ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.

7. ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయ్‌..!

‘‘26/11 ఉగ్రదాడి జరిగి 13ఏళ్లు గడిచినా ఆ చీకటి రాత్రులు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ దాడి.. భారత్‌కు ఎప్పటికీ ఓ బరువైన చరిత్రే’’ అంటూ 2008లో జరిగిన ముంబయి పేలుళ్లను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఈ దాడి జరిగి నేటికి 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన ఓపీనియన్‌లో బిగ్‌బీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

8. జాంగ్‌ గవోలీ అనే కొండను ఢీకొన్న పెంగ్‌ షువాయి..!

ఇటీవల చైనా టెన్నిస్‌ స్టార్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి అదృశ్యంతో మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీ పేరు తెరపైకి వచ్చింది. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత ఇప్పటి వరకూ పెంగ్‌ ఆచూకీ లేదు. అప్పుడప్పుడు పెంగ్‌ ఫొటోలు, వీడియోలు చైనా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మరో వైపు గవోలీ బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌, బీఆర్‌ఐ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశాడు.

9. దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మరో బ్లాక్‌ ఫ్రైడే!

ఈరోజు స్టాక్‌ మార్కెట్లకు మరో బ్లాక్‌ ఫ్రైడేగా మిగిలిపోయింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసులు, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ మదుపర్లను నిండా ముంచాయి. మార్కెట్లకు ఎరుపు రంగు పులిమాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,254.79 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,993.89 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1687.94 పాయింట్ల భారీ నష్టంతో 57,107.15 వద్ద ముగిసింది.

10. బెదరని కివీస్‌ ఓపెనర్లు

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. శ్రేయస్‌ అయ్యర్ (105), శుభ్‌మన్‌ గిల్‌ (52), రవీంద్ర జడేజా (50), అశ్విన్‌ (38) రాణించడంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన కివీస్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. భారత్‌ కంటే ఇంకా 216 పరుగులు వెనుకబడి ఉంది. 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.