
గ్రేటర్ హైదరాబాద్
ముసాయిదా రూపకల్పన.. నేడు చర్చ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతంచేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలదళం కార్యాచరణపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండురోజుల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్టీ రాష్ట్ర పదాధికారులతో సమావేశం జరిగింది. బండి సంజయ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, తరుణ్‌ఛుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. రైతాంగానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రవ్యాప్తంగా దళితబంధును అమలుచేయడం, నిరుద్యోగం, ధరణి పోర్టల్ సమస్యలు, రాజకీయ పరిస్థితులపై ఐదు తీర్మానాలు చేయాలని సమావేశంలో నిర్ణయించి..ముసాయిదా తీర్మానాలు రూపొందించారు. శనివారం జరిగే కార్యవర్గ సమావేశంలో వీటిపై చర్చించి తీర్మానాలను ఆమోదించనున్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తరుణ్‌ఛుగ్ సూచించినట్టు.సమావేశం అనంతరం ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు.