
గ్రేటర్ హైదరాబాద్
రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గురువారం రాత్రి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి దాన్ని పట్టుకొని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 కుట్లు వేసి ఇంజక్షన్లు ఇచ్చారు. ఇది ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలోని అటవీప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు.
- ఈనాడు, రాజమహేంద్రవరం