
తెలంగాణ
సైఫాబాద్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయవాది కె.కొమిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది.