Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
మహిళలు మాట్లాడితే కేసులు మంత్రులు తిడితే అదనపు రక్షణా?

పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజం

అనంతపురం(రాణినగర్‌), న్యూస్‌టుడే: రాజకీయకారణాలతో ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిన పోలీసులు, ప్రభుత్వంపై మొదట కేసు పెట్టాలని పీఏసీ ఛైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలుగు మహిళా అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ప్రియాంకను ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు సతీమణిపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక మహిళలు మాట్లాడితే.. వారిపై కేసులు పెట్టడం, ఇళ్లలో సోదాలు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దుర్భాషలాడుతూ.. అవమానపరుస్తున్న మంత్రులకు మాత్రం అదనపు రక్షణ కల్పిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? పోలీసువ్యవస్థ, డీజీపీ ఎలా సమర్థించుకుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలి. అనంతపురం జిల్లాలో మహిళలపై, ఇళ్లలో ఎలా ప్రవర్తించారో రాష్ట్రం మొత్తం తెలిసింది. ఏదో మాట్లాడారని నోటీసులు ఇస్తే అందరూ హాజరయ్యారు. వెళ్లిన తర్వాత పోలీసులను బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరి ఇంటికి 20 నుంచి 50 మందిని పంపి ఒక భయానక వాతావరణం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇలా ఉంటుందనేలా సమాజంలో భయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు...’ అని కేశవ్‌ పేర్కొన్నారు. దీనిపై తెదేపా అధిష్ఠానం నిర్ణయం మేరకు న్యాయపరమైన మార్గం వెతుకుతున్నామని, ఎవరైతే తప్పు చేశారో వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.