
తెలంగాణ
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: కొవిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ కుటుంబానికి రూ.3 లక్షల సహాయాన్ని సినీనటుడు చిరంజీవి శుక్రవారం అందజేశారు. మాస్టర్, ఆయన పెద్దకుమారుడు ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. విషయం తెలిసిన చిరంజీవి.. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్‌కు చెక్కు అందజేశారు. అండగా ఉంటామని తెలిపారు.