
గ్రేటర్ హైదరాబాద్
అమరావతి రైతుల యాత్రకు నెల్లూరు నీరాజనం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ‘రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాటలను గుర్తుచేస్తూ.. ఆ పార్టీ నాయకులు రైతుల్లో ఉత్సాహం నింపారు. పాదయాత్రలో రైతులకు తోడుగా జనసేన శ్రేణులు కదం తొక్కారు. రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర 26వ రోజు రాజుపాళెం నుంచి నెల్లూరు వరకు 15 కి.మీ. సాగింది. కోవూరు, నెల్లూరు నగరంలో వ్యాపారులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని సంఘీభావం తెలిపారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్రలో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన బీసీ సంఘం నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.