
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యాకమిటీల పదవీ కాలాన్ని విద్యాశాఖ ఆరు నెలలపాటు పొడిగించింది. గతంలోని కమిటీల రెండేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో డిసెంబరు 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.