
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: మైనార్టీ విద్యార్థులు జాతీయస్థాయి ప్రీ-మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత విద్యాసంవత్సరంలో 50 శాతానికన్నా తక్కువ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ప్రీ-మెట్రిక్ (ఆరు నుంచి పదో తరగతి) కేటగిరీలో ఫ్రెషర్‌గా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం ఈ సారి (2021-22 విద్యాసంవత్సరం) వెసులుబాటు కల్పించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు.