తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Omicron Variant: బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కలకలం.. ఇద్దరికి పాజిటివ్‌

లండన్‌: దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్​ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్​ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని వెల్లడించారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు.

కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించి ఆ ఇద్దరికీ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్​లో ఉన్నారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆ దేశ హెల్త్​ సెక్రెటరీ సాజీద్​ జావెద్​ తెలిపారు. ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.

Read latest National - International News and Telugu News


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.