
ఫీచర్ పేజీలు
కొత్త ప్రాంతాలను చూడాలనుకునే పర్యాటకులకు బాగా నచ్చే ప్రదేశం... లాబాస్సిన్ వాటర్ ఫాల్ రెస్టారెంట్.. ఫిలిప్పీన్స్‌లోని ఈ వాటర్‌ఫాల్ రెస్టారెంట్‌ని టియాంగ్లోని విల్లా ఎస్కుడెరో రిసార్ట్ నిర్వహిస్తోంది. మానవ నిర్మితమైన ఈ వాటర్ ఫాల్ టూరిస్ట్‌లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీంట్లోనే వెదురుతో చేసిన బల్లలపై ఎంచక్కా కూర్చొని ఓ వైపు జల కళను చూస్తూ.. మధురమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ... మరోవైపు అక్కడి స్థానిక సీ ఫుడ్‌ను ఆరగించవచ్చు. నచ్చినవాళ్లు నీటిలో ఈత కొడుతూ, ఆటపాటల్లో మునిగి తేలుతుంటే.. మరికొందరు అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందిస్తారు. బాగుంది కదూ.