Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
క్వార్టర్స్‌లో మనిక

హోస్టన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ మనిక బాత్రా సత్తా చాటింది. ఆమె మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మనిక-అర్చన కామత్‌ 11-4, 11-9, 6-11, 11-7తో డోరా-జార్జినియా పోటా (హంగేరి)పై విజయం సాధించారు. సెమీస్‌లో స్థానంలో కోసం మనిక జంట.. సారా-జియా లియాన్‌ జంటతో తలపడనుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మనిక-సత్యన్‌ 15-17, 10-12, 12-10, 11-6, 11-7తో కనాక్‌ జా (అమెరికా)-వాంగ్‌ మాన్‌యూ (చైనా)పై చెమటోడ్చి గెలిచారు. తొలి రెండు గేమ్‌లు చేజారినా.. గొప్పగా పుంజుకున్న భారత జంట వరుసగా మూడు గేమ్‌లు గెలిచి విజయాన్ని అందుకోవడం విశేషం. క్వార్టర్స్‌లో టొమోకాజు-హయాటా (జపాన్‌)తో మనిక-సత్యన్‌ పోటీపడనున్నారు. మరోవైపు శరత్‌ కమల్‌-అర్చన ప్రిక్వార్టర్స్‌లో ఓడారు. వీరు జియా నాన్‌-ఇమాన్యుయేల్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం చవిచూశారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.