Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
సెమీస్‌లో సింధు ఔట్‌

ఇండోనేసియా ఓపెన్‌

బాలి: ఈ ఏడాది సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ గెలవాలన్న భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఆశ నెరవేరలేదు. ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఆమె పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ సింధు 21-15, 9-21, 14-21తో రెండో సీడ్‌ రచనోక్‌ ఇంటోనన్‌ (థాయ్‌లాండ్‌)పై పోరాడి ఓడింది. తొలి గేమ్‌లో దూకుడుగా ఆడిన సింధు ఆరంభంలోనే 8-3తో ఆధిక్యంలో నిలిచింది. రచనోక్‌ నుంచి పోరాటం ఎదురైనా..తట్టుకుని నిలిచిన ఆమె 21-15తో గేమ్‌ గెలిచింది. కానీ రెండో గేమ్‌లో ఇంటోనన్‌ విజృంభించింది. విరామ సమయానికి ఆమె 11-7తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత 12 పాయింట్లతో 10 పాయింట్లు సొంతం చేసుకున్న ఈ థాయ్‌ స్టార్‌ గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ రచానోక్‌దే జోరు. బ్రేక్‌ సమయానికి ఆమె 11-6తో నిలిచింది. అయితే  వరుస పాయింట్లు సాధించిన సింధు 13-16తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆ తర్వాత అనసవర తప్పిదాలు చేసిన తెలుగమ్మాయి గేమ్‌పై పట్టు కోల్పోయింది. దీన్ని సొమ్ము చేసుకున్న రచనోక్‌.. 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

పోరాడి ఓడిన సాత్విక్‌ జోడీ

మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకు జోడీ సాత్విక్‌-చిరాగ్‌ 16-21, 18-21తో టాప్‌ సీడ్‌ జంట మార్కస్‌ ఫెర్నాడీ-కెవిన్‌ సంజయ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.