
తెలంగాణ
మనం తినే ఆహారం పైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధమని మన సనాతన ఆరోగ్య శాస్త్రం ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమై అనారోగ్యానికి దారితీస్తున్నాయి. దీంతో సంపాదనలో అధిక మొత్తం కుటుంబ వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం సన్నగిల్లితే కుటుంబ పోషణ కష్టమవుతుంది. రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజల విషయంలో ఈ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కల్తీలు, కాలుష్యం, మానసిక ఒత్తిళ్లు ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం పౌరసరఫరా వ్యవస్థల ద్వారా రాయితీలపై ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెలు సరఫరా చేస్తున్నాయి. అయినా పేద ప్రజల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నట్లు ప్రజారోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో ఉన్న పెరట్లో పలు రకాల పండ్లు, కూరగాయలు పండించుకొని ఆరోగ్యాంగా జీవించవచ్చు. అయితే ఎలాంటి పండ్లు, కూరగాయలు పండించుకోవచ్చు? వాటి విత్తనాలు ఎక్కడ లభిస్తాయి? పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పండించుకోవాలంటే ఏమి చేయాలి. అనేక పోషకవిలువలున్న ఆకుకూరలు పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెరటి తోటల పెంపకంతో ఎలాంటి ప్రయోజనాలున్నాయి మొదలైన అంశాలను మీకు అందిస్తోంది డిసెంబరు ‘అన్నదాత’.
మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత డిసెంబరు-2021 సంచికలో...
‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెం: 9121157979, 8008522248 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)