
తెలంగాణ
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్ గ్రామంలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కల్లాలు లేకపోవడంతో ధాన్యం ఆరబోయడానికి అక్కడి రైతులకు పెద్దకొత్తపల్లి-వనపర్తి బీటీ రహదారే దిక్కు. కోతల అనంతరం కొనుగోలు కేంద్రానికి అందరూ ఒకేసారి ధాన్యాన్ని తీసుకొస్తే స్థలం దొరకదన్న ఉద్దేశంతో ఆ గ్రామ రైతులు రహదారి వెంట ఇలా సంచులు ఉంచి, గాలికి కొట్టుకుపోకుండా వాటిపై రాళ్లు పెట్టారు. ఇది తమ స్థలం అని సూచించేలా రైతులు సుమారు 3 కిలోమీటర్ల మేర సంచులతో ‘రిజర్వు’ చేసుకున్న ఈ చిత్రం కల్లాల కొరతకు అద్దం పడుతోంది.
- న్యూస్టుడే, పెద్దకొత్తపల్లి