
తెలంగాణ
మెదక్ జిల్లా ఎల్లుపేట వద్ద తాలుకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తరుగు తీస్తున్నారంటూ శనివారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 4 కిలోల తరుగు తీస్తున్నారని, అంత తీయొద్దని ఐకేపీ సిబ్బందిని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట రైతులు కోరడంతో కేంద్రం నిర్వాహకులు తూకాలను నిలిపివేశారు. దీంతో అన్నదాతలు రహదారిపై ధాన్యం తాలుకు నిప్పుపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ కొనుగోలు కేంద్రంలోనూ రెండు నుంచి మూడు కిలోలు తరుగు తీస్తున్నారంటూ అక్కడి రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
-న్యూస్టుడే, టేక్మాల్, తంగళ్లపల్లి