
తాజా వార్తలు
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలన్న సీఎంవో ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. తదుపరి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనపెట్టారు.
2.ఒప్పందం ప్రకారమే బియ్యం తీసుకుంటాం
ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని స్పష్టంచేశారు.కేంద్రం కొత్త నిబంధనలేం తేలేదని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉప్పుడుబియ్యం ఇవ్వబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్ ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి మాటమార్చిందని ఆరోపించారు.
3.జగన్ రైతు వ్యతిరేక విధానాలపై లోక్‌సభలో పోరాడండి
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెదేపా ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు.
‘ఒమిక్రాన్’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.
ఒకప్పుడు అది గాజుల పోచంపల్లి... తర్వాత ఇకత్ పట్టుచీరల ఊరు.. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దాతృత్వానికి దారి చూపి భూదాన్ పోచంపల్లి అయింది.. పడుగూపేకలే జీవితంగా గడిపే ఈ చేనేత కళాకారుల పల్లె తాజాగా ‘ఉత్తమ పర్యటక గ్రామం’గా ప్రపంచపటంపై నిలిచింది! ఐక్యరాజ్యసమితి అవార్డు గెలుచుకున్న పోచంపల్లి ప్రత్యేకతలను చూసేయండి.
6.మన ‘సిన్నతల్లి’.. 20 ఏళ్లుగా తల్లడిల్లి!
దొంగతనం అనుమానంతో అమాయకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి క్రూరంగా హింసించడం.. దెబ్బలకు తట్టుకోలేక వారిలో ఒకరు చనిపోతే తప్పు కప్పిపుచ్చుకోడానికి కట్టుకథలల్లడం.. చివరకు న్యాయస్థానంలో దోషులుగా తేలడం.. ఇటీవల విడుదలైన ‘జైభీమ్’ సినిమాలో కథాంశమిది. ఎప్పుడో తమిళనాడులో జరిగిన యథార్థగాథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ‘సిన్నతల్లి’ పోరాటం ఫలించి లాకప్‌డెత్ బాధ్యులకు శిక్ష పడుతుంది.
7.ఫ్రెషర్స్ కోసం పెరిగిన పోటీ
పేరున్న విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రముఖ ఐటీ సంస్థలు వీరిని నియమించుకునేందుకు ముందు వరుసలో ఉండేవి. విద్యార్థులూ వీటికే ప్రాధాన్యం ఇస్తుండేవారు. ఇప్పుడు మధ్యస్థాయి ఐటీ సంస్థలూ ‘ఫ్రెషర్స్’ కోసం పోటీ పడుతున్నాయి. నియామకాల్లో తాజా ఉత్తీర్ణులకు ప్రాధాన్యమిస్తూ.. ఉద్యోగానికి అవసరమైన శిక్షణను తామే ఇస్తున్నాయి.
ఐటీ కంపెనీలు ఒక్కసారిగా పంథా మార్చాయి. ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్(అంతర్గత శిక్షణ)ను తప్పనిసరి చేస్తున్నాయి. బీటెక్ 7వ సెమిస్టర్లో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు 3-4 నెలల శిక్షణకు తీసుకుంటున్నాయని, దీనివల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సాధారణంగా కొలువుకు ఎంపిక కాకముందే పరిశ్రమల్లో పనిచేసే అనుభవం కోసం కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లకు ఆహ్వానిస్తుంటాయి.
దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూపు దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న భారీ సెమీకండక్టర్ల (చిప్‌ల) పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మంది ఉపాధి పొందే వీలున్న పరిశ్రమ కావడంతో ఇది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే టాటా సంస్థ అయిదు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తుండడంతో పాటు ఇక్కడ అన్ని రకాల అనుకూలతలు ఉన్నందున మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ వైపే మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చని భావిస్తోంది.
విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకల సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి.
మరిన్ని
New Zealand MP: పురిటినొప్పులు వస్తున్నా సైకిల్ నడుపుకుంటూ ఆసుపత్రికి.. ఎంపీ సాహసం
POCSO Court: ఒక్కరోజులోనే తీర్పు.. రేప్ కేసులో దోషికి జీవిత ఖైదు!
Salman Khan: ‘ఇలాంటి పనులు చేయకండి’.. అభిమానులకు సల్మాన్‌ఖాన్ విజ్ఞప్తి
US: చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లోనే.. విడుదల తర్వాత విరాళాల వెల్లువ
Starlink Internet: ‘స్టార్‌లింక్’కు సబ్‌స్క్రైబ్ అవ్వొద్దు.. యూజర్లకు కేంద్రం సూచన
Sivasankar: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Motorola: 200 ఎంపీ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం పునరాలోచన.. సమీక్షించాకే నిర్ణయం!
WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్ చేయకుండానే పంపేయండిలా!
Ap News: దిల్లీలో అఖిలపక్ష సమావేశం.. ఏపీ ఎంపీలు ఏమన్నారంటే..?
IND vs NZ: నాలుగో రోజు భారత్‌దే ఆధిపత్యం.. ఆఖర్లో అశ్విన్ మాయ
Ts News: మనిషి అత్యంత తెలివైన, ప్రమాదకరమైన జీవి: త్రిదండి చిన్నజీయర్ స్వామి
IND vs NZ: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
Puneeth Rajkumar: అప్పూ ఫొటోలు చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నా: శివరాజ్‌కుమార్
Ts News: సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్
Ts News: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్ శ్రీనివాస్
IND vs NZ: అర్ధశతకంతో మెరిసిన శ్రేయస్.. టీ విరామానికి ముందు ఔట్
Omicron: ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్ కలకలం.. ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!
MSRTC: ఆరు వేల మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ!
omicron: ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్
Bigg Boss Telugu 5: కాజల్.. రవిలలో ఎవరి కోసం సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు?
Omicron: కొత్త వేరియంట్‌పై భారత టాప్ వైరాలజిస్ట్ ఏమన్నారంటే..
Omicron: భేష్.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్: అమెరికా
Akhanda: ‘అఖండ’ హైలైట్స్ అదుర్స్.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే
IND vs NZ: ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్ భరత్: లక్ష్మణ్
Crime News: ధరణినే బురిడీ కొట్టించి.. నకిలీ పాసుపుస్తకంతో భూమి విక్రయానికి యత్నం
Bigg boss 5: టాప్-5లో ఎవరో వీళ్లు చెప్పేశారు! వేదికపై శ్రీహాన్, దీప్తి సునయన సందడి
Akhanda: బాలకృష్ణ ఆటంబాంబు.. ఎలా వాడాలో బోయపాటికే తెలుసు: రాజమౌళి
KGF 2: ‘కేజీయఫ్2’ టీమ్‌కు ఆమీర్‌ఖాన్ క్షమాపణలు.. రాఖీభాయ్‌కి ప్రచారం చేస్తా!
Omicron: ఒమిక్రాన్ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక
Axar Patel : బేసిక్స్‌కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్ పటేల్
Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!
Ap News: హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన లెక్చరర్.. సోషల్ మీడియాలో వైరల్
China incursions: భాజపా.. బీజింగ్ జనతా పార్టీలా మారింది: ఖర్గే
IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్‌లు.. ఒకేలా ముగింపు
Winter session: కాంగ్రెస్‌కు ఝలక్.. విపక్షాల భేటీకి టీఎంసీ దూరం
Drones: ‘పాక్ మాదిరి దుశ్చర్యలకు కాదు.. మానవాళి సేవకే మా డ్రోన్లు’
John Abraham: జాన్ అబ్రహాం గాయాలు చూసి ఆశ్యర్యపోయిన అమితాబ్!
Organ Donation Day: ‘బతికున్నప్పుడు రక్తదానం.. మరణించాక అవయవదానం’ నినాదంగా మారాలి
AP News: సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి
Omicron Variant: బ్రిటన్‌లో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్
IND vs NZ: శ్రేయస్ అయ్యర్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసల వర్షం.!