
తాజా వార్తలు
1.వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలి : చంద్రబాబు
వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే.. కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదన్నారు.. ప్రకృతి వైపరీత్యాల నిధులనూ దారి మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు.
2.రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన టీమ్ఇండియా
టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో పూర్తిగా తేలిపోయింది. 14/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు భోజన విరామ సమయానికి 84/5తో నిలిచింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కైల్ జేమీసన్ 2/21, టిమ్‌సౌథీ 2/27, అజాజ్ పటేల్ 1/29 రాణించడంతో భారత్ కష్టాల్లోపడింది.
3.కొత్త వేరియంట్‌పై భారత టాప్ వైరాలజిస్ట్ ఏమన్నారంటే..
ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇది తట్టుకునే వీలుందని పేర్కొన్నారు. భారత్‌లో టాప్ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ల్లో ఒకరైన గగన్ దీప్ ప్రస్తుతం వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
4.భేష్.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్: అమెరికా
దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా, ఆ దేశం కొత్త వేరియంట్‌ను గుర్తించి.. వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. శనివారం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెడి పాండొర్తో సమావేశమయ్యారు.
5.543 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,91,236 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8,774 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 9,481 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని కేంద్రం వెల్లడించింది.
6.ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్
భారత్‌లో తగిన కొవిడ్ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ కట్టడికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.
7. మోదీకి ‘రాగం’తో పేరు పెట్టిన విజ్లింగ్ విలేజ్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. కాంగ్‌థాంగ్(విజ్లింగ్ విలేజ్) ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం.. మోదీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ గౌరవర్థంగా ఈ పేరు పెడుతున్నట్లు మేఘాలయ సీఎం కె. సంగ్మా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన మోదీ.. తనకు పేరు పెట్టినందుకు ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
8.‘అఖండ’ హైలైట్స్ అదుర్స్.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే
మాస్ పల్స్ తెలిసిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎంతో వేడుకగా నిర్వహించారు.
9.ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్ భరత్: లక్ష్మణ్
టీమ్ఇండియా యువ కీపర్, బ్యాటర్ కేఎస్ భరత్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం భరత్.. వృద్ధిమాన్ సాహాకు బదులుగా వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మూడు కీలక వికెట్లు తీయడంలో భాగస్వామి అయ్యాడు.
10.సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి
గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు.
మరిన్ని
New Zealand MP: పురిటినొప్పులు వస్తున్నా సైకిల్ నడుపుకుంటూ ఆసుపత్రికి.. ఎంపీ సాహసం
POCSO Court: ఒక్కరోజులోనే తీర్పు.. రేప్ కేసులో దోషికి జీవిత ఖైదు!
Salman Khan: ‘ఇలాంటి పనులు చేయకండి’.. అభిమానులకు సల్మాన్‌ఖాన్ విజ్ఞప్తి
US: చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లోనే.. విడుదల తర్వాత విరాళాల వెల్లువ
Starlink Internet: ‘స్టార్‌లింక్’కు సబ్‌స్క్రైబ్ అవ్వొద్దు.. యూజర్లకు కేంద్రం సూచన
Sivasankar: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Motorola: 200 ఎంపీ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం పునరాలోచన.. సమీక్షించాకే నిర్ణయం!
WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్ చేయకుండానే పంపేయండిలా!
Ap News: దిల్లీలో అఖిలపక్ష సమావేశం.. ఏపీ ఎంపీలు ఏమన్నారంటే..?
IND vs NZ: నాలుగో రోజు భారత్‌దే ఆధిపత్యం.. ఆఖర్లో అశ్విన్ మాయ
Ts News: మనిషి అత్యంత తెలివైన, ప్రమాదకరమైన జీవి: త్రిదండి చిన్నజీయర్ స్వామి
IND vs NZ: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
Puneeth Rajkumar: అప్పూ ఫొటోలు చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నా: శివరాజ్‌కుమార్
Ts News: సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్
Ts News: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్ శ్రీనివాస్
IND vs NZ: అర్ధశతకంతో మెరిసిన శ్రేయస్.. టీ విరామానికి ముందు ఔట్
Omicron: ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్ కలకలం.. ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!
MSRTC: ఆరు వేల మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ!
omicron: ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్
Bigg Boss Telugu 5: కాజల్.. రవిలలో ఎవరి కోసం సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు?
Omicron: కొత్త వేరియంట్‌పై భారత టాప్ వైరాలజిస్ట్ ఏమన్నారంటే..
Omicron: భేష్.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్: అమెరికా
Akhanda: ‘అఖండ’ హైలైట్స్ అదుర్స్.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే
IND vs NZ: ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్ భరత్: లక్ష్మణ్
Crime News: ధరణినే బురిడీ కొట్టించి.. నకిలీ పాసుపుస్తకంతో భూమి విక్రయానికి యత్నం
Bigg boss 5: టాప్-5లో ఎవరో వీళ్లు చెప్పేశారు! వేదికపై శ్రీహాన్, దీప్తి సునయన సందడి
Akhanda: బాలకృష్ణ ఆటంబాంబు.. ఎలా వాడాలో బోయపాటికే తెలుసు: రాజమౌళి
KGF 2: ‘కేజీయఫ్2’ టీమ్‌కు ఆమీర్‌ఖాన్ క్షమాపణలు.. రాఖీభాయ్‌కి ప్రచారం చేస్తా!
Omicron: ఒమిక్రాన్ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక
Axar Patel : బేసిక్స్‌కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్ పటేల్
Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!
Ap News: హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన లెక్చరర్.. సోషల్ మీడియాలో వైరల్
China incursions: భాజపా.. బీజింగ్ జనతా పార్టీలా మారింది: ఖర్గే
IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్‌లు.. ఒకేలా ముగింపు
Winter session: కాంగ్రెస్‌కు ఝలక్.. విపక్షాల భేటీకి టీఎంసీ దూరం
Drones: ‘పాక్ మాదిరి దుశ్చర్యలకు కాదు.. మానవాళి సేవకే మా డ్రోన్లు’
John Abraham: జాన్ అబ్రహాం గాయాలు చూసి ఆశ్యర్యపోయిన అమితాబ్!
Organ Donation Day: ‘బతికున్నప్పుడు రక్తదానం.. మరణించాక అవయవదానం’ నినాదంగా మారాలి
AP News: సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి
Omicron Variant: బ్రిటన్‌లో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్
IND vs NZ: శ్రేయస్ అయ్యర్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసల వర్షం.!