తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
UPTET: వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్‌ప్రదేశ్‌ టెట్‌ రద్దు

లఖ్‌నవూ: ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించాల్సిన ‘యూపీటీఈటీ- 2021’ ప్రశ్నాపత్రం లీక్ అయింది. మథుర, ఘజియాబాద్, బులంద్‌శహర్‌ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో ఇది వైరల్‌ కావడంతో.. ప్రభుత్వం వెంటనే పరీక్షను రద్దు చేసింది. మళ్లీ నెల రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2500కు పైగా కేంద్రాల్లో జరగాల్సిన ఈ పరీక్షకు దాదాపు 19.99 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డ్(యూపీబీఈబీ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

రంగంలోకి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌..

ఈ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు ఇప్పటివరకు లఖ్‌నవూ, మేరఠ్‌, వారణాసి, గోరఖ్‌పూర్‌ తదితర నగరాలకు చెందిన మొత్తం 23 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రశ్నాపత్రం నిర్వహణ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఈ విషయమై స్పందిస్తూ.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారని, నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ విధించడంతోపాటు వారి ఆస్తులనూ జప్తు చేస్తారని తెలిపారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.