తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
US: చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లోనే.. విడుదల తర్వాత విరాళాల వెల్లువ

వాషింగ్టన్‌: చేయని నేరానికి ఓ వ్యక్తి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. దశాబ్దాలపాటు జైలు గోడల మధ్యే మగ్గిపోయాడు. చివరకు నిర్దోషి అని తేల్చి అతడికి స్వేచ్ఛ ప్రసాదించేనాటికి ఆయనకు 62 ఏళ్లు వచ్చేశాయి. అగ్రరాజ్యానికి చెందిన కెవిన్​ స్ట్రిక్​లాండ్​ అనే వ్యక్తి దీన గాథ ఇది. అయితే కెవిన్‌ గురించి తెలుసుకున్న చాలా మంది ఆర్థిక సాయం అందించి ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు విరాళంగా జమయ్యాయి. 

అసలేం జరిగిందంటే.. 

1978 ఏప్రిల్​ 25న కన్సాస్​ నగరంలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. లేరీ ఇన్​గ్రామ్​, జాన్​ వాకర్, షెర్రీ బ్లాక్​ అనే ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింథియా డగ్లస్​ అనే మహిళ కాల్పులు జరిపిన నలుగురిలో కెవిన్ స్ట్రిక్‌లాండ్‌ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కెవిన్​ను అరెస్ట్​ చేశారు. కోర్టు విచారణలో కూడా డగ్లస్​ ఇదే విషయాన్ని చెప్పింది. ఆమె సాక్ష్యాన్ని పరిగణించి కెవిన్​కు కోర్టు 50 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే డగ్లస్​ తాను పొరబడినట్లు ఆ తర్వాత  తెలుసుకుంది. కానీ ఇప్పుడు తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో ఈ విషయం గురించి కొంతకాలం ఆమె ఎక్కడా చెప్పలేదు. 

అలా నిర్దోషిగా.. 

దశాబ్దాలు గడిచాక మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో కెవిన్​ శిక్షను సవాల్​ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న డగ్లస్​ మృతిచెందడంతో.. ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులను కోర్టు విచారించింది. అయితే పోలీసులే కెవిన్​ను దోషి అని చెప్పమని తనను ఒత్తడి చేశారని డగ్లస్​ ఓ సందర్భంలో తమతో చెప్పినట్లు వారు కోర్టుకు తెలిపారు. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు డగ్లస్​ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణించిన కోర్టు.. హత్యకు పాల్పడిన నిందితులు కూడా ఓ సందర్భంలో కెవిన్​తో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కెవిన్​ను నిర్దోషిగా ప్రకటించింది. 

రూ. 10.50కోట్ల విరాళాలు 

ఈనెల 23న కెవిన్​  జైలు నుంచి విడుదలయ్యాడు. తప్పుడు తీర్పు ఇచ్చినందుకు అందాల్సిన నష్టపరిహారం కూడా ఆయనకు అందలేదు. దీంతో బాధితుడికి సాయం చేసేందుకు ‘గో ఫండ్ ​మీ’ అనే సంస్థ ముందుకొచ్చింది. కెవిన్‌ గురించి తెలుసుకున్న ఎందరో ఆయన దీన గాథను చూసి చలించిపోతున్నారు. తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. గో ఫండ్‌ మీ సంస్థ ఇప్పటివరకు రూ. 10.50కోట్లు (1.5 మిలియన్లు) విరాళంగా సేకరించి కెవిన్​కు అందించింది.

Read latest National - International News and Telugu News


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.