
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వరదల దృష్ట్యా కడప జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వర్షాల కారణంగా అనేక చోట్ల రాకపోకలు స్తంభించాయి. చిట్వేలు మండలంలో ఎల్లమరాజు చెరువు నిండి అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాపూరు-నెల్లూరు వైపు వెళ్లే వాహనాలకు అంతరాయమేర్పడింది. గుంజనఏరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బాలపల్లికి శేషాచలం అడవుల నుంచి వరద భారీగా వస్తోంది. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే కోడూరు పట్టణంలోని నరసరాంపేటలో కోతకుగురై రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదాన్ని గమనించి ముందే ఇల్లు ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవకర్గంలో భారీ వర్షాలకు పెన్నా, అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు వానలు పడతాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టారు. ఉరవకొండ, కూడేరుకు చెందిన అధికారులు డ్యామ్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్యామ్ చరిత్రలో మొట్టమొదటి సారి గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.
నాయుడుపేటలో కుండపోత వర్షం..
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఆత్మకూరులో రహదారులపై వర్షం నీరు నిలిచింది. 14వ వార్డులో పాతబస్టాండ్ వద్ద కాలువ పొంగింది. పెరారెడ్డి బీసీ కాలనీలోకి వరదనీరు చేరడంతో స్థానికులు భయాందోలనకు గురయ్యారు. అధికారులు వరదనీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. అనంతసాగరం, ఏఎస్‌పేట, సంగం, మరిపాడు, చేజర్ల మండలాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగుతున్నాయి. కొన్ని చోట్ల గండ్లు కొట్టి చెరువుల నుంచి నీరు వదిలారు. నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై అక్కడక్కడ వరద పారుతోంది.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, చినగంజాం, పర్చూరులో వర్షం కురిసింది. చీరాలలో వీధులన్నీ జలమయమయ్యాయి. ఒంగోలులో జోరు వానకు లోతట్టు ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షానికి కోసిన వరి పంట నీటమునిగింది. పంటను కాపాడుకునేందుకు రైతులు కుప్పలు వేసుకుంటున్నారు.
29న అల్పపీడనం ఏర్పడే అవకాశం..
దక్షిణ అండమాన్ సముద్రంలో 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో... రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం నుంచి రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో... ‘‘తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. డిసెంబరు 1వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి’’ అని హెచ్చరించారు.
మరిన్ని
New Zealand MP: పురిటినొప్పులు వస్తున్నా సైకిల్ నడుపుకుంటూ ఆసుపత్రికి.. ఎంపీ సాహసం
POCSO Court: ఒక్కరోజులోనే తీర్పు.. రేప్ కేసులో దోషికి జీవిత ఖైదు!
Salman Khan: ‘ఇలాంటి పనులు చేయకండి’.. అభిమానులకు సల్మాన్‌ఖాన్ విజ్ఞప్తి
US: చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లోనే.. విడుదల తర్వాత విరాళాల వెల్లువ
Starlink Internet: ‘స్టార్‌లింక్’కు సబ్‌స్క్రైబ్ అవ్వొద్దు.. యూజర్లకు కేంద్రం సూచన
Sivasankar: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Motorola: 200 ఎంపీ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం పునరాలోచన.. సమీక్షించాకే నిర్ణయం!
WhatsApp Stickers: వాట్సాప్ స్టిక్కర్స్.. సేవ్ చేయకుండానే పంపేయండిలా!
Ap News: దిల్లీలో అఖిలపక్ష సమావేశం.. ఏపీ ఎంపీలు ఏమన్నారంటే..?
IND vs NZ: నాలుగో రోజు భారత్‌దే ఆధిపత్యం.. ఆఖర్లో అశ్విన్ మాయ
Ts News: మనిషి అత్యంత తెలివైన, ప్రమాదకరమైన జీవి: త్రిదండి చిన్నజీయర్ స్వామి
IND vs NZ: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
Puneeth Rajkumar: అప్పూ ఫొటోలు చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నా: శివరాజ్‌కుమార్
Ts News: సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్
Ts News: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్ శ్రీనివాస్
IND vs NZ: అర్ధశతకంతో మెరిసిన శ్రేయస్.. టీ విరామానికి ముందు ఔట్
Omicron: ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్ కలకలం.. ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు... అఖిలపక్ష భేటీ ప్రారంభం!
MSRTC: ఆరు వేల మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ!
omicron: ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్
Bigg Boss Telugu 5: కాజల్.. రవిలలో ఎవరి కోసం సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు?
Omicron: కొత్త వేరియంట్‌పై భారత టాప్ వైరాలజిస్ట్ ఏమన్నారంటే..
Omicron: భేష్.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్: అమెరికా
Akhanda: ‘అఖండ’ హైలైట్స్ అదుర్స్.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే
IND vs NZ: ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్ భరత్: లక్ష్మణ్
Crime News: ధరణినే బురిడీ కొట్టించి.. నకిలీ పాసుపుస్తకంతో భూమి విక్రయానికి యత్నం
Bigg boss 5: టాప్-5లో ఎవరో వీళ్లు చెప్పేశారు! వేదికపై శ్రీహాన్, దీప్తి సునయన సందడి
Akhanda: బాలకృష్ణ ఆటంబాంబు.. ఎలా వాడాలో బోయపాటికే తెలుసు: రాజమౌళి
KGF 2: ‘కేజీయఫ్2’ టీమ్‌కు ఆమీర్‌ఖాన్ క్షమాపణలు.. రాఖీభాయ్‌కి ప్రచారం చేస్తా!
Omicron: ఒమిక్రాన్ కలకలం .. ఈ జాగ్రత్తలు మరవొద్దు: WHO హెచ్చరిక
Axar Patel : బేసిక్స్‌కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్ పటేల్
Omicron: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు..!
Ap News: హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన లెక్చరర్.. సోషల్ మీడియాలో వైరల్
China incursions: భాజపా.. బీజింగ్ జనతా పార్టీలా మారింది: ఖర్గే
IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్‌లు.. ఒకేలా ముగింపు
Winter session: కాంగ్రెస్‌కు ఝలక్.. విపక్షాల భేటీకి టీఎంసీ దూరం
Drones: ‘పాక్ మాదిరి దుశ్చర్యలకు కాదు.. మానవాళి సేవకే మా డ్రోన్లు’
John Abraham: జాన్ అబ్రహాం గాయాలు చూసి ఆశ్యర్యపోయిన అమితాబ్!
Organ Donation Day: ‘బతికున్నప్పుడు రక్తదానం.. మరణించాక అవయవదానం’ నినాదంగా మారాలి
AP News: సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి
Omicron Variant: బ్రిటన్‌లో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్
IND vs NZ: శ్రేయస్ అయ్యర్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసల వర్షం.!