
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ మాస్టర్ మరణంతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన ఇకలేరన్న విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడూ సరదాగా, అందరితో కలివిడిగా ఉండే ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. గతంలో అలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. శివ శంకర్ మాస్టర్ మనల్ని విడిచి వెళ్లిన నేపథ్యంలో ఆయన మాటలు మీకోసం యథాతథంగా..
ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీగా ఎలా ఉండగలుగుతున్నారు?
శివశంకర్ మాస్టర్: నా తల్లిదండ్రులు ఇచ్చిన బహుమతి, నా గురువుల ఆశీర్వాదం, ఆ పరమేశ్వరుడి దయ.
మీరు చాలా రిచ్ అని విన్నాం నిజమేనా?
శివశంకర్ మాస్టర్: మా తండ్రి పండ్ల వ్యాపారి. రాజమండ్రితో పాటు దాని చుట్టుపక్కల గ్రామాలకు హోల్‌సేల్‌గా పండ్లు సరఫరా చేసేవారు. ఆయన గ్రేట్ బిజినెస్ మ్యాన్
మీ ఫ్యామిలీలో ఎవరైనా డ్యాన్సు నేర్చుకున్నారా?
శివశంకర్ మాస్టర్: ఎవరూ లేరు. నాకే రావాలని ఆ భగవంతుడు అనుగ్రహించాడు. దాని వెనుక పెద్ద కథే ఉంది. చిన్నప్పుడు నా వెన్నెముక విరిగిపోయింది. మా అమ్మతో కలిపి వాళ్లు పది మంది అక్కాచెల్లెళ్లు. నాకు ఒకటిన్నర సంవత్సరాల వయసున్నప్పుడు మా పెద్దమ్మవాళ్లు నన్ను తన ఒళ్లొ కూర్చోబెట్టుకుని ఇంటి అరుగుమీద కబుర్లు చెప్పుకుంటున్నారట. అదే సమయంలో ఒక ఆవు తాడు తెంపుకొని వచ్చేసింది. అది ఎక్కడ వాళ్ల మీదకు వస్తుందోనని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లే సమయంలో గుమ్మం దగ్గర పడిపోవడంతో ఆమె చేతిలో ఉన్న నేను కింద పడిపోయాను. అప్పుడు వెన్నెముక విరిగిపోయింది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఏ డాక్టర్‌కు చూపించినా సరికాలేదు. అదే సమయంలో విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్ అనే ఆయన వద్దకు నన్ను తీసుకెళ్లారు. అప్పటికే ఆయనకు 70 సంవత్సరాలు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్ మా వాళ్లకు ఒక సలహా ఇచ్చారు. ‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేస్తే లేచి నడిచేలా చేయగలను’ అని అన్నారట. మా నాన్న ఆయనను నమ్మి అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు నేను పడుకునే ఉన్నాను. నాకు ఎలాగైనా చదువు చెప్పించాలని మా నాన్న నాకు ట్యూషన్ పెట్టారు. నేను నేరుగా అయిదో తరగతిలో చేరాను. స్కూల్ సెకండ్ బెల్ కొట్టినప్పుడు నన్ను తీసుకెళ్లేవారు. ఫస్ట్ బెల్ అవ్వకముందే తీసుకొచ్చేవారు. ఇతర పిల్లల్లా నేను ఆడుకోవడానికి లేదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. అప్పట్లో ‘సభ’ అని ఉండేది. అందులో మా నాన్నగారు సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి నన్ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై నాకు వ్యామోహం పెరిగిపోయింది. డ్యాన్స్ చేయాలన్న పట్టుదల నాలో పెరిగిపోయింది. దాంతో నా అంతట నేనే నేర్చుకుని, నాకు 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేసేవాడిని. అప్పటికి వెన్ను నొప్పి తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి నేను డ్యాన్సులు చేయడాన్ని మా నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం మా నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశా. చదువుకోకుండా ఇలా చేస్తున్నానని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశా. ‘తర్వాత ఏం చేస్తావు’ అని అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పా. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు నా జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్ అవుతాడు. వదిలెయ్’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద నృత్యం నేర్చుకున్నా. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నా. ఆ తర్వాత సలీమ్గారి దగ్గర సహాయకుడిగా చేరాను.
మీ తొలి సినిమా ఏది?
శివశంకర్ మాస్టర్: నేను సహాయకుడిగా పని చేసిన మొదటి సినిమా ‘పాట్టు భరదము’. పి.మాధవన్ దర్శకత్వంలో శివాజీ గణేశన్-జయలలిత జంటగా నటించారు. మాస్టర్‌గా ‘కురివికూడు’ అనేది నా తొలి సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే సరికి ‘ఖైదీ’ నా మొదటి సినిమా. అప్పట్లో సలీమ్గారు చాలా బిజీ. ‘రగులుతోంది మొగలిపొద’ పాటకు ప్రాక్టీసు చేసి వెళ్లాం. అయితే, వర్షం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత సలీమ్గారు అందుబాటులో లేకపోతే నేనే నృత్యాలు సమకూర్చా.
ఆ పాట తర్వాత చాలా ఇబ్బంది పడ్డారట!
శివశంకర్ మాస్టర్: మూడు నెలల పాటు చాలా బాధ పడ్డాను. (మధ్యలో అలీ అందుకుని.. ఆ పాటకు వచ్చిన క్రేజ్ చూస్తే ఆ క్రెడిట్ ఇప్పటికీ మీకే దక్కుతుంది.)
హీరోయిన్లకు ఇంత అందం ఇచ్చిన దేవుడు, ఎక్స్ప్రెషన్స్.. డ్యాన్సు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అని కామెంట్ చేస్తారట!
శివశంకర్ మాస్టర్: అవును! వాళ్లే అన్నీ చేస్తే, శివ శంకర్ మాస్టర్‌కు ఇంత పేరు వచ్చేది కాదేమో! ఇది కూడా నిజమే!(నవ్వులు)
మీకు ఎంతమంది అబ్బాయిలు?
శివశంకర్ మాస్టర్: నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడి పేరు విజయ్ శివ శంకర్, చిన్నవాడు అజయ్ శివ శంకర్. ఇద్దరూ డ్యాన్సు మాస్టర్లే!
ఒకవైపు బాధ మరోవైపు సంతోషం పలికించడం చాలా తక్కువమందికి వస్తుంది? మీరెలా నేర్చుకున్నారు?
శివశంకర్ మాస్టర్: నేను డ్యాన్సు నేర్చుకునేటప్పుడే ఇవన్నీ తెలుసుకున్నా.
ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లలో ఎవరు బెస్ట్ అంటారు?
శివశంకర్ మాస్టర్:నేను ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నా. ఈయన ఏదో ఫిటింగ్ పెడతాడని అనుకున్నా. మూవ్మెంట్స్ పరంగా అందరూ బాగా చేస్తున్నారు. కానీ, ఈ కళ ఎక్కడ నుంచి వచ్చిందనేది మాత్రం చూడటం లేదు. ‘మన్మథ రాజా.. మన్మథ రాజా..’ పాట తీసుకుంటే దీనికి తాళాలు ఎన్నో ఉన్నాయి. నేను పదేళ్లు తిరుపతి నరసింహులు నాయుడిగారి వద్ద కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నా. ఆయనకు ఒక పల్లవి వినిపిస్తే, రెండు చేతులతో రెండు రకాల తాళాలు వేస్తారు. అలాగే డ్యాన్సులకు కూడా ఐదు రకాల తాళాలు ఉన్నాయి. సంకీర్ణ నడకలో పాటవేస్తే, వన్, టూ చెప్పడానికి చాలా కష్టం. అలా వస్తే, చాలామంది డ్యాన్సు మాస్టర్లు బయటపడిపోతారు.
చాలామంది హీరోయిన్లకు ఎక్స్ప్రెషన్ రాదు! కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 50శాతం ఇస్తే చాలు ఆ హీరోయిన్ స్టార్ అవుతుంది? ఏమంటారు?
శివశంకర్ మాస్టర్: ఈ మాట చాలా మంది అన్నారు. రాజేంద్రప్రసాద్ అయితే, ‘మాస్టర్ మీరు ఒక ఇనిస్టిట్యూట్ పెట్టాలి. మీ తర్వాత ఎవరూ లేరు.’ అనేవారు.
అజిత్‌ను భయపెట్టారట!
శివశంకర్ మాస్టర్: అజిత్ ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా చేశారు. అందులో ఆయనవి మూడు వేషాలు. అది అద్భుతమైన సబ్జెక్ట్. ఒక రోజు కేఎస్ రవికుమార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మాస్టర్‌గారు మిమ్మల్ని డైరెక్టర్ కలవాలని అనుకుంటున్నారు’ అని చెప్పారు. సరే అని వెళ్లాను. ‘నేను అజిత్‌తో ఒక సినిమా చేస్తున్నా. టాకీ మొత్తం అయిపోయింది. ఒక పాత్రకు సంబంధించి షూటింగ్ మాత్రం మిగిలిపోయింది. 30రోజుల పాటు మీరు ఎక్కడికీ పోకుండా మాతో ఉండాలి. ఆ పాత్రకు సంబంధించి అజిత్‌కు యాక్టింగ్, డ్యాన్సు, ఫైటింగ్ అన్నీ చెప్పాలి’ అని కేఎస్ రవికుమార్ అన్నారు. ‘సర్ అన్ని రోజులంటే కష్టం అండీ’ అనిచెప్పా. ‘నువ్వు వస్తేనే చేస్తా. లేకపోతే నేను నష్టపోవాల్సి ఉంటుంది’ అని ఆయన అన్నారు. సర్లేనని ఒప్పుకొన్నా. ఆ సినిమాలో అజిత్ జమీందారు కొడుకు. కానీ, డ్యాన్సుపై విపరీతమైన ప్యాషన్ ఉంటుంది. డ్యాన్సులు చూసి చూసి తనొక ఫెమినిస్ట్‌గా ప్రవర్తిస్తాడు. సినిమా మొత్తంలో ఆ పాత్రకు నేనెలా చెబితే అజిత్ అలా చేశాడు. అయితే ఒక పాటకు భరతనాట్యం మేళవించి చేయాల్సి ఉంది. ఆ డ్యాన్సు అజిత్ అంతగా చేయలేడు. అదే కమల్‌హాసన్ అయితే ఇరగదీసేవాడు. ‘ఇంత ప్రాధాన్యం, సంగీతం ఉన్న పాటకు అజిత్ డ్యాన్సు చేయడం కష్టం. కాస్త మార్పులు చేస్తే బాగుంటుంది’ అని కేఎస్ రవికుమార్గారితో చెప్పా. అందుకు ఆయన ‘రెహమాన్‌కు ఫోన్ చేసి ఇస్తాను. మాట్లాడండి’ అని అన్నారు. ‘అంత పెద్ద సంగీత దర్శకుడు నాతో మాట్లాడతారా?’ అని నేను అనుకున్నా. కానీ ఫోన్ చేయగానే చాలా చక్కగా మాట్లాడారు. పాటకు సంగీతం మార్చాలని అడగగానే ‘మాస్టర్ ఈరోజు నన్ను వదిలేయండి. రేపు సాయంత్రానికి ఇచ్చేస్తా!’ అని అద్భుతమైన పాట ఇచ్చారు.
మీకెప్పుడైనా దర్శకత్వం చేయాలనిపించిందా?
శివశంకర్ మాస్టర్: అబ్బో! నాకు ఇష్టం లేదు. నటించాలని ఉంది. కానీ మీరేమో! తర్వాత చూద్దాం! వచ్చే ఏడాది చూద్దాం! అని తోసుకుపోతున్నారు. నాకేమో వయసు పెరిగిపోతూ ఉంది.
మొత్తం ఎన్ని భాషల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా చేశారు!
శివశంకర్ మాస్టర్: తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, తుళు, ఒరియా, మరాఠీ, జపనీస్ ఇలా పది భాషల్లో నేను సినిమాలకు నృత్యాలు సమకూర్చా.
ఒక దర్శకుడితో ఎనిమిది సినిమాలు చేశారు? అదే దర్శకుడితో మీకెందుకు గొడవ వచ్చింది?
శివశంకర్ మాస్టర్: నాకు ఎవరితోనూ గొడవ లేదు. నేను చాలా ఫ్లెక్సిబుల్. ఆ దర్శకుడికి నేనంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ నాకే ఇచ్చేవారు. రాత్రి సరిగా నిద్రపోయేవాడు కాదేమో! ఉదయం షూటింగ్‌కు వచ్చి సెట్లో కునికిపాట్లు పడుతూ ఉండేవాడు. నేను మైక్ తీసుకుని ‘టేక్’ అని గట్టిగా అరవగానే, అప్పుడు లేచి, ‘మాస్టర్‌గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు’ అని అడిగేవాడు. ‘అంతా సిద్ధంగా ఉంది. టేక్ చేస్తున్నాం’ అంటే ఇక్కడ బాగోలేదని ఇంకో చోటకి, అక్కడ బాగోలేదని మరో చోటకి, అక్కడా కూడా సరిగా లేదని మేము మొదట మొదలు పెట్టిన చోటుకే తీసుకొచ్చేవాడు. ఎంత టైమ్ వేస్ట్ చెప్పండి. సాంగ్ అవ్వక పోతే రివర్స్ నాకే పడేది! ‘నీకో నమస్కారం. నీ సినిమాకో నమస్కారం’ అని చెప్పి ఇక సినిమా చేయనని చెప్పా. ఆ తర్వాత ఆయనకు సినిమాలే లేకుండా పోయాయి. ఆ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటా.
ఇప్పటివరకూ ఎన్ని పాటలు చేశారు?
శివశంకర్ మాస్టర్: 15వేలకు పైగా చేశా. ఎక్కువగా కృష్ణగారి సినిమాలకు చేశా. ఎందుకంటే దర్శక-నిర్మాతల తొలి ఎంపిక నేనే అయ్యేవాడిని. ఎన్టీఆర్ కోప్పడటం చూశాను. నాగేశ్వరరావు కోపగించుకోవడం చూడలేదు. శోభన్‌బాబు కోప్పడని విషయం అస్సలు తెలియదు. కృష్ణగారికి కోపం వస్తుందని అస్సలు అనుకోలేదు. ‘ఏంటయ్యా! ఏంటిది’ అంటారే తప్ప అస్సలు కోప్పడరు. ‘సలీమ్ అంత సెక్సీగా చేయడే. శివ శంకర్ సెక్సీగా చేస్తాడయ్యా’ అనేవారు. ఒక డ్యాన్సర్‌గా చచ్చే వరకూ నేను పాటలు చేస్తూ ఉండాలి. సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలని నా కోరిక. భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం!
రాధను మీరు బాగా ఆటపట్టించేవాళ్లట!
శివశంకర్ మాస్టర్: ఆట పట్టించలేదు. రాధ అంటే యమ ఇష్టం. డ్యాన్సులో ఒక ఎట్రాక్షన్, కవ్వింపు, ప్యాషన్‌తో చేయాలంటే శ్రీదేవి తర్వాత రాధనే!
సిల్క్‌స్మిత అంటే మీకు ఎందుకంత కోపం!
శివశంకర్ మాస్టర్: ఆమె అంటే నాకు అస్సలు కోపం లేదు. ఎందుకో ఆవిడ మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది. అలా చేయడం నాకు బాధ అనిపించింది. ‘భలేతమ్ముడు’ బాలకృష్ణగారి సినిమా. నాలుగు పాటలు చేశా. చాలా బాగా వచ్చాయి. అయిదో పాటు స్మితతో రిహార్సల్స్ చేసి ఇంటికి వస్తుంటే కంపెనీ నుంచి ఫోన్ చేశారు. ‘మాస్టర్‌గారు మీకూ స్మితకు ఏంటి గొడవ. మీరుంటే చేయనంటోంది స్మిత’ అని అడిగారు. ‘నాకూ తెలియదు అన్నా’. ‘సరోజ అనే ఆవిడను రికమెండ్ చేస్తోంది. ఏం చేయమంటారు’ అని అడిగారు. ‘సర్లే వదిలేయండి’ అన్నా. పొద్దున్నే షూటింగ్ పెట్టుకొని, రిహార్సల్స్ చేసి వచ్చిన నాకు ఎంత బాధ ఉంటుంది. అప్పుడ నిర్మాత ఫోన్ చేసి, ‘శివ శంకర్ మాస్టరే కావాలి. ఈ అమ్మాయి చేస్తుందో లేదో కనుక్కోండి. చేయనంటే బాలయ్యబాబుకి చెప్పి వేరే వాళ్లను పెట్టండి. రెండు రోజులు షూటింగ్ ఆలస్యమైనా పర్వాలేదు’ అన్నారట. స్మిత చేయనంది. దీంతో జయమాలినిని పెట్టి తీశాం. అప్పటి నుంచి స్మిత సినిమాలకు మేము పనిచేయకూడదని నేను, సుందరం మాస్టర్ అనుకున్నాం. కానీ, స్మిత మంచి నటి.
మీరెప్పుడూ ఇలాంటి గెటప్‌లోనే ఎందుకుంటారు!
శివశంకర్ మాస్టర్: సంప్రదాయంగా ఉండాలని. రాఘవేంద్రరావుగారు ‘మీరు నగలన్నీ పెట్టుకుని ఉంటే చూడాలని అనుకుంటున్నా’ అని అనేవారు.
అజిత్ చేసిన ఆ నాట్యకారుడి పాత్రను కొందరు హీరోలకు చెబితే కాదన్నారట?
శివశంకర్ మాస్టర్: అవును. ఆ పాత్ర చేయమని బాలకృష్ణగారిని అడిగా. ‘నాన్నగారు బృహన్నల వంటి పాత్రను చేశారు కదా. మీరు ఈ పాత్ర చేస్తే బాగుంటుంది’ అని చెప్పా. ‘అది నిప్పులాంటిది. ఆ పాత్ర చేస్తే నిప్పులో చేయిపెట్టినట్లే. కొన్ని చూసి ఆనందించాలంతే! మనం చేయకూడదు’ అని అన్నారు. చిరంజీవి చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో పక్కన పెట్టేశారు.
మీరు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా?
శివశంకర్ మాస్టర్: ఫ్యామిలీతోనే కొంచెం ఎఫెక్ట్ అయ్యాను. నా పెద్దకోడలు నాపై లేనిపోనివి చెప్పింది. నన్ను ‘నాన్న’ అని పిలిచిన ఆ అమ్మాయి. వేరే రకంగా చెప్పింది. అది తప్ప ఇంకా ఏవీ లేవు.
‘బాహుబలి’ ఎందుకు చేయలేదు?
శివశంకర్ మాస్టర్: పిలిచారు. మా అబ్బాయి పెళ్లి కారణంగా చేయలేకపోయా!
మరికొన్ని ప్రశ్నలకు ఒక్కమాటలో సమాధానం!
ఆడవాళ్లు: మర్యాద
నాట్యం: నా ప్రాణం
సినిమా: నా జీవితం
తమిళ ఇండస్ట్రీ: ఒక కన్ను
తెలుగు ఇండస్ట్రీ: రెండో కన్ను, నా హార్ట్
కన్నడ ఇండస్ట్రీ: ఒక చేయి
మలయాళ ఇండస్ట్రీ: ఇంకో చేయి
హిందీ ఇండస్ట్రీ: ఒక కాలు
ఒడిశా ఇండస్ట్రీ: ఇంకో కాలు
రొమాన్స్: నాకది దూరమైన విషయం
రగులుతోంది మొగలిపొద: రగిలింది కదా! రగిలి భగ్గునమండింది. అలాంటి సాంగ్స్ ఇంకా రావాలి
రాధ: అసలైన హీరోయిన్
సిల్క్‌స్మిత: నా కూతురులాంటిది. పోగొట్టుకున్నామనే బాధ
అలీ: మీతో నటించాలని తపన(తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇప్పిస్తా!)
మరిన్ని
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్ ప్రయోజనం ఏంటి?’
Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్
TS corona update: తెలంగాణలో కొత్తగా 184 కరోనా కేసులు.. ఒకరి మృతి
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్‌లో లేవ్!
Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
Sivasankar: ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్
Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్’ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
sirivennela: ‘సిరివెన్నెల’ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కొవిడ్ కేసులు
Mysuru: ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం నుంచి వేలిముద్రల సేకరణ
Motorola G31: మాల్వేర్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో మోటో కొత్త ఫోన్!
AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా?ఏది అనాలనుకున్నా ఆలోచించి అను..!
IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత్!
Omicron variant: స్కాట్లాండ్లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్’ గుర్తింపు
Taiwan: సైనికాధికారులతో జిన్‌పింగ్ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ
IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్
Corona: కరోనా క్లస్టర్‌గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్
Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ
IND vs NZ: తొలి సెషన్ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
Modi: అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య
CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్ శేషాద్రి ఉండాల్సిందే..
IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్ కోచ్ రాంచీ
Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి
Viral: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!
Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
UPTET: వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్‌ప్రదేశ్ టెట్ రద్దు
Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
Bigg Boss telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్.. కాజల్‌ను సన్నీ సేవ్ చేయడానికి కారణమదే!
sivasankar: ‘సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలనేదే నా కోరిక’
Omicron variant: కొత్త వేరియంట్‌పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
New Variant: ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు
Samantha: చిరుగులు.. పిన్నీసుల డ్రెస్! సామ్ కొత్త ఫొటోలు వైరల్
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్