Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
బంగ్లాకు ఆధిక్యం దక్కినా..

చాటోగ్రామ్‌: పాకిస్థాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బౌలర్లు గొప్పగా రాణించి.. జట్టుకు ఆధిక్యాన్నందించినా, బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో ఆ జట్టుకు కష్టాలు తప్పలేదు. 145/0తో శనివారం ఆటను ముగించిన పాక్‌ను.. మూడో రోజు తైజుల్‌ ఇస్లామ్‌ (7/116) ధాటికి దెబ్బ తింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ అబిద్‌ అలీ జోరు కొనసాగిస్తూ సెంచరీ (133; 282 బంతుల్లో 12×4, 2×6) సాధించినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ నిలబడలేదు. లోయరార్డర్లో ఫాస్ట్‌బౌలర్‌ ఫహీమ్‌ అష్రాఫ్‌ (38) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో పాక్‌ 286 పరుగులకే ఆలౌటై, బంగ్లాకు 44 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. అయితే ఈ ఆనందం బంగ్లాకు ఎక్కువ సేపు నిలవలేదు. షహీన్‌ అఫ్రిది (3/6) విజృంభించడంతో ఆదివారం ఆట ఆఖరుకు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 39/4తో నిలిచింది. ముష్ఫికర్‌ (12), యాసిర్‌ అలీ (8) క్రీజులో ఉన్నారు. బంగ్లా ప్రస్తుత ఆధిక్యం 83.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.