
క్రీడలు
దుబాయ్: మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), రష్యా కెరటం ఇయాన్ నెపోమ్నియాషి మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ముచ్చటగా మూడో గేమ్ కూడా డ్రా అయింది. ఆదివారం జరిగిన మూడో గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్సన్.. 41 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ ఆచితూచి ఎత్తులు వేయగా.. నెపోమ్నియాషి దూకుడుగా ఆడాడు. కానీ ఎక్కడా తప్పులకు అవకాశం ఇవ్వకుండా ఆడిన కార్ల్సన్.. గేమ్‌ను డ్రా దిశగా మళ్లించాడు. దీంతో మూడు గేమ్‌ల తర్వాత కార్ల్సన్-నెపోమ్నియాషి 1.5-1.5తో సమానంగా ఉన్నారు. 14 గేమ్‌ల ఈ సమరంలో ఆఖరికి విజేత తేలకపోతే టైబ్రేకర్ నిర్వహిస్తారు.