Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share Comments Telegram Share
అమరావతి రాజధానిగా ఉండేలా సిఫార్సు చేయండి

 అఖిలపక్ష సమావేశంలో తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల

ఈనాడు, దిల్లీ: ‘అమరావతిని రాజధానిగా అంగీకరించిన వారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేశారు. ఇప్పుడు ఆ బిల్లులు ఉపసంహరించుకోవడంతో అనిశ్చితి ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గట్టిగా సిఫార్సు చేయాలి’ అని కోరినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. లేకుంటే రాష్ట్రప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన విషయాలను ఆయన విలేకరులకు వివరించారు. ‘కొవిడ్‌-మూడో దశ ఒమిక్రాన్‌ రూపంలో విరుచుకుపడుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాణనష్టం జరగకుండా చూడాలి. ప్రజలందరికీ రెండో డోసు, బూస్టర్‌ డోసులు ఇప్పించాలి. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ధర తగ్గించినా ఏపీలో తగ్గించలేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలి. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నందుకు సంతోషం. ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధర దక్కేలా ఈ సమావేశాల్లోనే చట్టాలు తేవాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దు. దానికి గనులు కేటాయించాలి.ఏపీలో వరద ఉపశమన చర్యలు తీసుకోవడం లేదు. రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగంపై దృష్టిపెట్టాలి’ అని కోరినట్లు ఆయన చెప్పారు. శాసనసభలో తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సభలో లేవనెత్తుతామన్నారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.