
ఆంధ్రప్రదేశ్
ఎస్ఎఫ్ఐ మహా సభల్లో ఎమ్మెల్సీ విఠపు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగంలో అంధకారం నెలకొందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) 23వ రాష్ట్ర మహాసభలు ఆదివారం విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న సభలకు ప్రారంభ సూచికగా రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్ ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) అమలు చేయడంలో ముందుండాలని వైకాపా ప్రభుత్వం ఉత్సుకత చూపుతోందని విమర్శించారు. రహస్య ఒప్పందాలతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు.