
తెలంగాణ
కొవిడ్ అనంతర లక్షణాలు కనిపించడంతో
ఈనాడు, అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. కొవిడ్ అనంతర(పోస్ట్ కొవిడ్) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగొచ్చారు. మళ్లీ చికిత్స కోసం అక్కడికే వెళ్లినట్లు తెలిసింది.