తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/11/2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. గణపతిధ్యానం  మంచిది.

కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. మనోబలం సర్వప్రధానం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎవ్వరితోను వాదోపవాదాలు వద్దు. మృదు సంభాషణ మేలు చేస్తుంది. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.

చేపట్టిన పనులను ప్రణాళికా బద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. గతం కంటే మంచి సమయం. బంధు ప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగానమ్మకండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం. 

ఇబ్బందులను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవగాహనతో ముందుకు సాగండి. ఊహించిన ఫలితాలను పొందుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. దుర్గాదేవి స్తోత్రం చదవాలి.

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.  భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంతో ముందుకు సాగుతారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభదాయకమైన కాలం.  అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడడం మంచిది. అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

 

మనోబలం  మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

 గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి.   నవగ్రహ ధ్యానం శుభప్రదం .

అనుకున్నది దక్కుతుంది. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఇష్టదేవతా స్తుతి శుభాన్నిస్తుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.