తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
TS News: నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80  అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. సోమవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నుంచి బయలుదేరే లాంచీ సాయంత్రం 3 గంటలకు శ్రీశైలానికి చేరుతుంది. ఆ రాత్రి అక్కడే బసచేసి దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని పర్యాటక సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు పేర్కొన్నారు.

ఛార్జీల వివరాలు...

* సాగర్‌ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు - రూ.1,500, పిల్లలకు - రూ.1,200. (శ్రీశైలం నుంచి కూడా సాగర్‌కు కూడా ప్రయాణించే అవకాశం ఉంది)

* రెండు వైపుల పెద్దలకు - రూ. 2,500, పిల్లలకు - రూ.2,000.

* హైదరాబాద్‌ నుంచి బస్‌ ప్యాకేజీ  సహా పెద్దలకు - రూ.3,999, పిల్లలకు - రూ.3,399


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.