
తెలంగాణ
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. సమీర్‌శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవంబరు 2న కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.