
తెలంగాణ
అయిదు నెలల్లో 254.67 మి.యూ విద్యుదుత్పత్తి
మేళ్లచెరువు, న్యూస్టుడే: పులిచింతల జల విద్యుత్తు కేంద్రం అరుదైన రికార్డు సాధించింది. నీటి ప్రవాహం ప్రారంభమైన 5 నెలల్లోనే 254.671 మిలియన్ యూనిట్ల(మి.యూ.) విద్యుదుత్పత్తి చేసినట్లు జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్ ఆదివారం తెలిపారు. విద్యుత్తు కేంద్రం నిర్మించిన సమయంలో 100 ఏళ్ల ప్రవాహాన్ని గణించి ఏడాదిలో గరిష్ఠంగా 219.54 మి.యూ. ఉత్పత్తి చేయవచ్చని జెన్కో అధికారులు అంచనా వేశారు. అయితే ఈ నీటి ఏడాదిలో 5 నెలల్లోనే కేంద్రం ఈ లక్ష్యాన్ని సాధించింది. గత జులైలో కృష్ణానదిలో ప్రవాహం మొదలవగా.. ఈ ఏడాది 219.54 మి.యూ. విద్యుదుత్పత్తి లక్ష్యం సాధించాలని అధికారులు నిర్దేశించుకున్నారు.