
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 6,75,614కు చేరుకున్నాయి. కొవిడ్‌తో మరొకరు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 3,989కి పెరిగింది. వైరస్‌తో చికిత్స పొంది తాజాగా 144 మంది కోలుకున్నారు. దీంతో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,68,090కు చేరుకుంది.
ఏపీలో కొవిడ్‌తో ఆరుగురి మృతి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య మొత్తం 27,657 నమూనాలను పరీక్షించగా.. 178 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు కరోనా కారణంగా మృతిచెందారు.