
తెలంగాణ
భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భువనగిరిలో జరిగిన జన విజ్ఞాన వేదిక(జేవీవీ) తెలంగాణ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం జేవీవీ రాష్ట్ర కమిటీ, సబ్‌కమిటీలను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ సీˆహెచ్.మోహన్‌రావు(సీసీఎంబీ పూర్వ సంచాలకులు), డాక్టర్ మెహతాబ్ ఎస్ బామ్జీ(పూర్వ ఉపసంచాలకులు, ఎన్ఐఎన్), డాక్టర్ ప్రసాదరావు(నిమ్స్ మాజీ డైరెక్టర్), రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు (ఓయూ విశ్రాంత ప్రొఫెసర్), ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్(స్కూల్ అసిస్టెంట్, స్టేషన్ ఘన్పూర్), ఉపాధ్యక్షులుగా రమాదేవి(గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్), శ్రీనివాస్, రాములమ్మ, డాక్టర్ ప్రతాప్, కస్తూరి, జితేందర్, కోశాధికారిగా రావుల వరప్రసాద్, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.