
సినిమా
హైదరాబాద్: ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ గేమ్ షో ‘బిగ్‌బాస్ సీజన్-5’ చివరి దశకు చేరుకుంటోంది. టాప్ 7 కంటెస్టెంట్స్‌తో తాజాగా బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఫొటోలు ఉన్న బాల్స్‌ని కంటెస్టెంట్స్ అందరికీ ఇచ్చిన బిగ్‌బాస్.. ఇంటి మెయిన్ గేట్లను తెరిచాడు. ఎవరికైతే ఇంటిలో కొనసాగే అర్హత లేదని భావిస్తారో వాళ్ల ఫొటోలతో ఉన్న బాల్స్‌ని ఆ గేట్ అవతలికి వెళ్లేలా తన్నాలి. కెప్టెన్‌గా ఉన్న షణ్ముఖ్ మొదట నామినేషన్ ప్రక్రియ ప్రారంభించగా.. కాజల్‌కు ఇంట్లో కొనసాగే అర్హత లేదని చెప్పి.. ఆమె ఫొటోతో ఉన్న బంతిని గేట్ అవతలికి తన్నాడు.
అనంతరం సన్నీ.. శ్రీరామ్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇక, ప్రియాంక ఎప్పటిలాగే.. ఇంటిసభ్యుల్ని నామినేట్ చేయడానికి తన దగ్గర బలమైన కారణం ఏమీ లేదని చెప్పి.. ‘‘బిగ్‌బాస్ నాకు కాస్త సమయం కావాలి’’ అని అడిగింది. వెంటనే కెప్టెన్ షణ్ముఖ్ స్పందిస్తూ.. ‘‘చెప్పాలి పింకీ తప్పదు. ఇప్పటికైనా చెప్పాలి కదా. కారణాలు లేవు.. నేను ఇప్పుడే చెప్పలేను అంటే కుదరదు కదా’’ అని అనగా..‘‘నేను హర్ట్ అయ్యింది నీ వల్లే. చెప్పాలనుకుంటే నీ పేరే చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు’’ అని సమాధానమిచ్చింది. మధ్యలో సన్నీ అందుకుని కాజల్, మానస్‌లను నామినేట్ చేయాలని సిల్లీ రిజన్స్ చెప్పాడు. వెంటనే షణ్ముఖ్ కలగజేసుకొని.. ‘‘నామినేషన్ అనేది చాలా సీరియస్ విషయం. ఇక్కడ కామెడీ చేయకండి’’ అని చెప్పాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ప్రియాంక.. బిగ్‌బాస్ మిమ్మల్ని చివరిసారి హెచ్చరిస్తున్నాడు. మీరు కనుక ఇప్పుడు ఎవర్నీ నామినేట్ చేయకపోతే.. మీరే నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తారు’’ అంటూ హెచ్చరించాడు.