
తాజా వార్తలు
1.అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం
పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైకాపాకు చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులు.. శాలివాహన ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డి అక్కడికి వెళ్లి వారిని కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని.. తప్పకుండా సహకరిస్తానన్నారు.
2.పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను మధ్నాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతికి సంతాపంగా రాజ్యసభను ఛైర్మన్ గంటపాటు వాయిదా వేశారు.
3.సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం
విపక్షాల గందరగోళాల మధ్య సోమవారం లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుపై చర్చ జరగాలని విపక్ష నేతలు డిమాండ్లు చేశారు. అయితే వారి ఆందోళనల మధ్యే ఈ రద్దు బిల్లుకు ఆమోదం దక్కింది. గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
4.కొత్త వేరియంట్ వ్యాప్తి.. జపాన్ కీలక నిర్ణయం!
కొవిడ్ కొత్త వేరియంట్ క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేశ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వెల్లడించారు.
5.ఆ విషయాలపై ఇంకా స్పష్టత లేదు: డబ్ల్యూహెచ్ఓ
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా? అనే విషయాలపై ‘‘ఇంకా స్పష్టంగా తెలియదు’’ అని పేర్కొంది.
ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు..!
6.తొలి సెషన్ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
ఐదోరోజు ఆట తొలి సెషన్లో న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది. 4/1తో సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లాథమ్ (35), సోమర్‌విలే(36) నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై పైచేయి సాధించారు. ఈ సెషన్ మొత్తంలో టీమ్ఇండియా 31 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది.
7.ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
కరోనా తర్వాత వరుసగా సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఇప్పటివరకూ పాసింజర్ రైలులా సాగిన సినీ ప్రయాణం డిసెంబరు నెలలోఎక్స్ప్రెస్ స్పీడ్‌లో దూసుకుపోనుంది. అందుకు ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలే కారణం. మరి డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు అటు థియేటర్, ఇటు ఓటీటీలో వస్తున్నాయి.
8.సంగారెడ్డి జిల్లాలో 10క్వింటాళ్ల గంజాయి పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కంది గ్రామం వద్ద పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా తుక్కు కింద గంజాయి మూటలు కనిపించాయి.
9.అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా: తాప్సీ
అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్’, ‘హసీనా దిల్‌రుబ’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ తార. ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
10.అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
మొబైల్ ప్రియులను అలరించేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తుంటాయి. ఇప్పటి వరకు అదిరే ఫీచర్లతో ఎన్నో రకాల కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. వీటిలో 5జీ, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ అంటూ వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. అయితే గత కొద్ది నెలలుగా కరోనా పరిస్థితుల కారణంగా కొన్ని ఫోన్ల విడుదల చేయడం ఆలస్యమైంది.
మరిన్ని
Rakesh Tikait: సాగుచట్టాల రద్దు ఓకే.. ఇక ఇతర సమస్యలపై ఉద్యమిస్తాం!
Rahul Gandhi: ‘చర్చలకు అనుమతి ఇవ్వకుంటే పార్లమెంట్ ప్రయోజనం ఏంటి?’
Karnataka: హామీ పత్రం ఇస్తేనే టీకా వేసుకుంటా.. కర్ణాటకవాసి వినూత్న డిమాండ్
TS corona update: తెలంగాణలో కొత్తగా 184 కరోనా కేసులు.. ఒకరి మృతి
Omicron: ఇప్పటివరకు.. ఒమిక్రాన్ వేరియంట్ దాఖలాలు భారత్‌లో లేవ్!
Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్ కామెంట్స్!
Sivasankar: ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్ ఓంకార్
Covaxin: విదేశాలకు ‘కొవాగ్జిన్’ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్
sirivennela: ‘సిరివెన్నెల’ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
Omicron: ఒమిక్రాన్ కలకలం.. బోట్స్వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
Ap corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 101 కొవిడ్ కేసులు
Mysuru: ఆస్తి కోసం మానవత్వం మరిచి.. మృతదేహం నుంచి వేలిముద్రల సేకరణ
Motorola G31: మాల్వేర్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో మోటో కొత్త ఫోన్!
AP News: బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ అయితే నామినేట్ చేయవా?ఏది అనాలనుకున్నా ఆలోచించి అను..!
IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత్!
Omicron variant: స్కాట్లాండ్లో ఆరుగురిలో ‘ఒమిక్రాన్’ గుర్తింపు
Taiwan: సైనికాధికారులతో జిన్‌పింగ్ భేటీ.. తైవాన్‌పైకి యుద్ధవిమానాలు..!
Supreme Court: కృష్ణా ట్రైబ్యునల్ అంశం.. పిటిషన్లపై 13 నుంచి సుప్రీంలో విచారణ
IND vs NZ: ఆరు వికెట్ల దూరంలో టీమ్ఇండియా.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్
Corona: కరోనా క్లస్టర్‌గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్
Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ
IND vs NZ: తొలి సెషన్ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత్
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Winter session: పార్లమెంటు సమావేశాలు.. అలా ప్రారంభమై.. ఇలా వాయిదా
Modi: అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య
CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Dollar Seshadri: ప్రముఖులు తిరుమల వస్తే డాలర్ శేషాద్రి ఉండాల్సిందే..
IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్ కోచ్ రాంచీ
Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి
Viral: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని 1600 కిలోమీటర్ల ప్రయాణం!
Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్
UPTET: వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం.. ఉత్తర్‌ప్రదేశ్ టెట్ రద్దు
Twitter: ట్వీట్లతో ఇబ్బంది పెడుతున్నారా.. వారికిలా చెక్ చెప్పేయండి!
Bigg Boss telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్.. కాజల్‌ను సన్నీ సేవ్ చేయడానికి కారణమదే!
sivasankar: ‘సెట్లో డ్యాన్స్ చేస్తూ చచ్చిపోవాలనేదే నా కోరిక’
Omicron variant: కొత్త వేరియంట్‌పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
Sivasankar: శివశంకర్ని కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు: చిరంజీవి
punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
New Variant: ఒమిక్రాన్‌లో 30కిపైగా మ్యుటేషన్లు.. ప్రమాదకరమే!
Shreyas Iyer: శ్రేయస్ అరుదైన ఫీట్.. తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు
Social Look: అమెరికాలో ‘లైగర్’ గ్యాంగ్.. అదాశర్మ ఫొటో తీస్తే!
AP News: ఏపీలో ఉద్యోగ సంఘాల పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన నేతలు
Samantha: చిరుగులు.. పిన్నీసుల డ్రెస్! సామ్ కొత్త ఫొటోలు వైరల్
త్రిపుర స్థానిక ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్... తృణమూల్, సీపీఎంకు గట్టి దెబ్బ!
Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. వారంలో మూడోసారి!
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
TS News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి: కేసీఆర్