తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Thaman: అరవింద సమేతలో ఆ పాట కోసం ఎంతో కష్టపడ్డా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తమన్‌.. గతంలో ఓ పాట కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. కానీ, దానికి అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని వివరించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో  ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘అరవిందసమేత’ ఆల్బమ్‌ అంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ‘ఏడ పోయినాడో’ అనే పాట కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేశాను. అందులో విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాట పాడటం కోసం వైజాగ్‌ నుంచి నిఖిత శ్రీవల్లి అనే సింగర్‌ని పిలిపించాం. ఎంతోమంది వాయిస్‌లు టెస్ట్‌ చేశాం. కానీ, ఆ అమ్మాయి వాయిస్‌ మాత్రమే ఆ పాటకు సెట్‌ అయ్యింది. సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఆ పాటకు మంచి గుర్తింపు వస్తుందని భావించాను. ‘రెడ్డమ్మతల్లి’, ‘పెనివిటి’ పాటలకు వచ్చినంత ప్రశంసలు ఈ పాటకు రాలేదు. అప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అలాగే నేను ట్యూన్స్ కాపీ కొడుతున్నానంటూ కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. ఆ బాధ, కోపం పోగొట్టుకోవడానికి వెంటనే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్‌ ఆడతా. పాటలకు అనుకున్నంత మంచిగా ట్యూన్స్‌ రాకపోయినా సరే వెంటనే గ్రౌండ్‌కి వెళ్లిపోతా’’ అని తమన్‌ వివరించారు.

Read latest Cinema News and Telugu Newsమరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.