సినిమా

Facebook Share Twitter Share Comments Telegram Share
జోరు పెంచిన కిరణ్‌ అబ్బవరం.. క్లాప్‌ కొట్టిన కొరటాల శివ

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు కిరణ్‌ అబ్బవరం సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ చిత్రాలతో మెప్పించిన కథానాయకుడీయన. ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్‌ పీసీ 524’ సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్‌ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రమేశ్‌ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా మరో దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. డైరెక్టర్‌ మలినేని గోపీచంద్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.

గీతం.. సమ్మతమే 

కిరణ్‌ హీరోగా గోపీనాథ్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. ఈ ప్రేమకథా చిత్రంలోని ‘నేను ఊహించలే’ అనే గీతం విడుదలైంది. యాజిన్‌ నైజర్‌, శిరీష భాగవతుల ఆలపించిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News



మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.